ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల క్లబ్ అధ్యక్షునిగా పులి రాము ఎన్నికయ్యారు. పట్టణంలోని క్లబ్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సెక్రెటరీ పదవికి పులి రాము, పులిశెట్టి శ్రీనివాస్ లు ఇరువురు పోటీపడ్డారు హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో పులి రాము అధ్యక్షనిగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీగా బొడ్ల జగదీష్, ట్రెజరీగా పేరాల వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ సెక్రటరీగా జంగిలి శశికాంత్ రెడ్డి, ఎంసీ మెంబర్లుగా అనుమల్ల సంజయ్ సామ్రాట్, బద్దం గంగారెడ్డి, కోరండ్ల అనంతరెడ్డి, నీలగిరి వెంకటరమణ, తాడేపు వెంకటరమణ, తుమ్మనపల్లి రఘు, పుప్పాల నర్సింగరావులు ఎన్నికయ్యారు.