చురుగ్గా రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటు పనులు – పడమటి సోమారంలో పనులు పరిశీలించిన పింగళ్ రెడ్డి, శ్యామ్ గౌడ్
బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాటు కానున్న ఈ రైతు కొనుగోలు కేంద్రం భవన నిర్మాణానికి స్థానిక రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భూమిని చదును చేశారు. యంత్రాలను తీసుకొచ్చి అక్కడి నేలను భవన నిర్మాణానికి అనుకూలంగా బాగు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి పింగల్ రెడ్డి, పొట్టోల శ్యామ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, మాజీ జడ్పీటీసీ సందిగారి బస్వయ్య, గడ్డం బాల్ రెడ్డి, వాకిటి సంజీవ రెడ్డి, సర్పంచ్ బద్దం అంజయ్య, ఉపసర్పంచ్ తంతరపల్లి ప్రదీప్ గౌడ్, రైతు సంఘo చైర్మన్ ఎర్రబోతు శ్రీనివాస్, ఆల్వ రామకృష్ణా రెడ్డి, బొమ్మగోని బస్వయ్య గౌడ్, ఆల్వ మోహన్ రెడ్డి, కుంభం భాస్కర్ గౌడ్, ఆలేటి రామ్ కొండల్, ఆల్వ ఆనంత రెడ్డి, బద్దం బిక్షపతి, ఆల్వ లింగా రెడ్డి, కుంభం సుభాష్, బలరాం, కిషోర్ రెడ్డి, కుదుస్, ఉస్మాన్తో పాలు స్థానిక రైతులు పాల్గొన్నారు. పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి స్థానిక రైతులు ధన్యవాదాలు తెలిపారు.