- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.
- బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్.
గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల అధ్యక్షులు సిరికొండ తిరుపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీలు,మండల,జిల్లా పరిషత్తులు,మున్సిపాలిటీలలో బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీ రిజర్వేషన్లు అమలకు అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికలు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు.42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనిఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు సిరికొండ తిరుపతి,కట్కూరి తిరుపతి,కట్కూరి సతీష్,ఒడ్నాల రాజేష్,గంగాధర కుమార్,విలసాగరం వెంకటేష్,సిరికొండ శేఖర్,తదితరులు పాల్గొన్నారు.