- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
- “అమ్మ మాట అంగన్వాడీ బాట” కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్.
- అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించిన ప్రభుత్వ విప్.
- భూషణ్ రావు పేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖానకు భూమి పూజ నిర్వహించిన ప్రభుత్వ విప్.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కు అంగన్వాడీలె పునాదులని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కథలపూర్ మండలం గంభీర్ పూర్, దులూరు, సిరికొండ గ్రామాల్లో 36 లక్షలతో నూతన అంగన్వాడీల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన, భూషణ్ రావు పేట గ్రామంలో 20 లక్షలతో పల్లే దవాఖానకు భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ “అమ్మ మాట అంగన్వాడీ బాట” కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు అక్షర అభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని, ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారం అందించడానికి ఓకే మెను తయారుచేసి అందిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపు ఇచ్చారు.ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తుందని తెలిపారు. విద్యా రంగానికి పెద్ద పీట వేస్తూ ప్రజా ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని ప్రతి పెద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణం కోసం 200 కొట్లు ప్రభుత్వం మంజూరు చేశారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యలో మార్పు తీసుకువచ్చి, పెద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగి తల్లిదండ్రుల ఆశాయలను నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను స్వంత బిడ్డల వలె చూసుకుంటుందన్నారు.రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలు కాక ముందే రాష్ట్రంలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం కూడా పాఠశాల ప్రారంభం రోజునే దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణి చేశామన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద రాష్ట్రంలో ని పాఠశాలల్లో అనేక కోట్లతో మౌలిక వసతుల కల్పించడం జరిగిందని, ప్రభుత్వం ప్రతీ ఎమ్మెల్యే కు ఇస్తున్న స్పెషల్ డెవలప్మెంట్ ఫౌండ్ లో పాఠశాలకు 15 శాతం ఇస్తున్నట్లు తెలిపారు.ఉపాధ్యాయలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టీచర్ల బదిలీలు ప్రజా ప్రభుత్వంలో చేయడం జరిగిందన్నారు.వేసవి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల కు ప్రత్యెక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
- అన్ని వర్గాల సంక్షేమ కోసం ప్రజా ప్రభుత్వం కృషి.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి అమలు చేసున్నట్లు తెలిపారు.
- ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట.
ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు విప్ పేర్కొన్నారు.. అందులో భాగంగా భూషణ్ రావు పేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 800 కొట్లు లబ్దిదారులకు అందేసినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేస్తు, నూతన పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి వైస్ చైర్మన్ పులి హరిప్రసాద్, మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
