Take a fresh look at your lifestyle.

శిల్ప బృందావనంలో వైభవంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ​పల్లకి సేవలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత రామకృష్ణ గౌడ్

 

ముద్ర కూకట్‌పల్లి :
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శిల్ప బృందావనంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లకి సేవలో ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలతో డివిజన్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.​భక్తిశ్రద్ధలతో సాగిన పల్లకి సేవ కార్యక్రమం.​స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన నేతలు.​పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు మరియు కాలనీ వాసులు.

Leave A Reply

Your email address will not be published.