Take a fresh look at your lifestyle.

పట్టపగలే అక్రమ ఇసుక రవాణ అక్రమ‌ ఇసుక రవాణకు హద్దు ఏది

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి::

ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా‌ నుంచి‌‌ ఎలాంటి అనుమతులు లేకుండా గద్వాల జిల్లాకు టిప్పర్ ల ద్వారా అక్రమ ఇసుక రవాణ చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రతి రోజు గద్వాలకు పదుల సంఖ్యలో టిప్పర్ ల ద్వారా ఇసుక తరలిస్తున్న జిల్లా మైనింగ్, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి‌ 9గంటల‌ నుంచి ఉదయం 8 గంటల వరకు అక్రమ ఇసుక రవాణ జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణపై  అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై బాజాప్తా ఇసుక వాహనాలు వెళ్తున్నా పోలీస్‌ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . వారికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.