ముద్ర మల్కాజిగిరి
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మౌలాలి డివిజన్‌లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మౌలాలి డివిజన్‌లోని ప్రగతి నగర్‌లో రూ.29 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే లక్ష్మీ నగర్‌లో రూ.9 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు , అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.