Take a fresh look at your lifestyle.

జిల్లా కోర్టులో అంబలి కేంద్రం ప్రారంభం

ముద్ర, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు ప్రధాన కార్యదర్శి డబ్బుల నరసింహారెడ్డి తో కలిసి బుధవారం బార్ అసోసియేషన్ లో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అంబలిని తాగి సేదా తీర్చుకోవాలని సూచించారు .

ఈరోజు నుంచి ప్రతిరోజు ఎండాకాలం అయిపోయేంత వరకు మధ్యాహ్నము 12:00 PM నుంచి 2:00 PM వరకు రెండు గంటల అంబలి కేంద్రాన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డబ్బుల నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, కమిటీ సభ్యులు ,సీనియర్ న్యాయవాదులు , మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.