బాధ్యతల స్వీకరించిన న్యాయమూర్తి
శుభాకాంక్షలు తెలిపిన పాలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు.
ముద్ర, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కోర్టు లో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫ్యామిలీ కోర్టు జడ్జి)గా పి. ఆంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ రావు,ప్రధాన కార్యదర్శి డబ్బుల నర్సింహారెడ్డి, కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాదులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన జిల్లా మూడవ ఆదనపు న్యాయమూర్తి (ఫ్యామిలీ కోర్టు)పి.ఆంజనేయులు గారికి కోర్టు సిబ్బంది తోటి న్యాయమూర్తులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి డబ్బుల నర్సింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సభ్యులు ప్రభావతి, రఘు కుమార్, శశి బాబు, విష్ణు వేద, మహేష్ కుమార్, వంశీ కృష్ణ, మురళి మోహన్, జ్యోతి, తాహేర్,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..
