మాదాపూర్, ముద్ర విలేఖరి: మియాపూర్ డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్ మళ్లించకుండా చెరువు సుందరీకరణ పేరుతో కనీస ప్రత్యామ్నాయం లేకుండా డ్రైనేజీ నీళ్లను కాలనీలోకి వదిలేయడం వలన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ నాయకులు, కాలనీ వాసులతో కలిసి పర్యటించి సంబంధిత జిహెచ్ఎంసి ఉప కమిషనర్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే తగు తగు చర్యలు తీసుకోవాలని, లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిలదీస్తామని రవికుమార్ యాదవ్ హెచ్చరించారు. మురుగు నీరు పారుతున్న కాలనీలో స్థానికులతో కలిసి పర్యటించి వారి ఇబ్బందులు తెలుకున్నారు. రవికుమార్ పర్యటన సందర్భంగా ఆయన వెంట అధ్యక్షులు నరసింహ రాజు, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగుల గౌడ్, మాణిక్ రావు, గణేష్, జితేందర్, శ్రీనివాస్, శివరాజ్,శివ రెడ్డి, రాము, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.