Take a fresh look at your lifestyle.

పని మనుషులపై అప్రమత్తంగా ఉండాలి

 

ముద్ర కాప్రా
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఏసీపి వెంకట్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేపాలీల దొంగతనాలు వారి నేరాల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు కాలనీవాసులు నేపాలి పనిమనిషిలపై చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాలు తలెత్తిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
సమావేశంలో ముఖ్యంగా మేడ్ సర్వెంట్ల భద్రత, వారి నమోదు ప్రక్రియ, సమ్మర్ సీజన్‌లో పెరుగుతున్న దొంగతనాల నివారణ చర్యలు, సైబర్ క్రైమ్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు, అలాగే కాలనీ భద్రతకు సంబంధించి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు
ప్రజల సహకారం ఉంటేనే కాలనీల్లో భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని సీఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
మీ సహకారమే ప్రజల భద్రతకు బలం” అని పోలీసులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.