ముద్ర కూకట్‌పల్లి :
నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు.జేఎన్టీయూ చౌరస్తా వద్ద స్కైవాక్ నిర్మాణం మూసాపేట వై జంక్షన్ వద్ద అండర్ పాస్ పనుల వేగవంతం.
సర్దార్ నగర్లోని హిందూ స్మశాన వాటిక ప్రారంభోత్సవం.
రాజు కాలనీలోని స్థలాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికే కేటాయించాలని విన్నవించారు.
బండి రమేష్ వినతిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే అనుమతులు పొందిన పనులను తక్షణమే ప్రారంభిస్తామని, కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు