Take a fresh look at your lifestyle.

బస్సుల్లేక విద్యార్థుల అగచాట్లు

 

* బస్సులు లేక కాలినడకన పాఠశాలకు పోతున్న విద్యార్థులు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నది.చదువుకునేందుకు గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లడానికి తగినన్ని బస్సులు లేక విద్యార్థులు పడరానిపాట్లు పడుతున్నారు. కొంతమంది కాలినడకన, సైకిళ్లపై కిలోమీటర్ల దూరం వెళ్లి వస్తున్నారు. కొంతమంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కికిరిసి ప్రయాణం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో గల పెద్ద ధన్వాడ గ్రామానికి గత పది సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు చెందిన విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా ఆర్టీసి బస్సు రావడం లేదు. దీంతో పెద్ద ధన్వాడ నుంచి అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న విద్యార్థులు సుమారు‌ 5 కి.మీ నడుచుకుంటు వెళ్లాల్సిన పరిస్థితి‌‌ నెలకొంది. పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన విద్యార్థులు‌ఎండకాలంలో ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా 5 కి.మీ. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలోని జెడ్పి స్కూల్ కి వెళి విద్యనభ్యసిస్తున్నారు. ఎలెక్షన్ల సమయంలో పాలకులు మీ గ్రామానికి రోడ్లు వేస్తాం.. రవాణ సౌకర్యం కల్పిస్తాం, మౌళిక వసతులు మెరుగుపరుస్తాం అంటూ ప్రగల్బాలు పలికి, ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారే తప్పా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పెద్ద‌ధన్వాడ గ్రామానికి వెళ్లే రోడ్డు పై ఇసుక టిప్పర్ లు, ట్రాక్టర్ ల రాకపోకలతో రోడ్లు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారవడంతో ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. ఆర్టీసి బస్సులు లేక సరైన రోడ్లు లేక వివిధ రకాల వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సులు లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా పాలకులు, పరిపాలన అధికారులు పల్లెల బ్రతుకులు మార్చడం లేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మారుమూల గ్రామాల విద్యార్థుల కో సం బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.