రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: ఆటల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో సమానంగా తీసుకుని ముందుకు సాగాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు వీరారెడ్డి, కోల్ ఇండియా సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు రామ్మూర్తి అన్నారు.స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో శని,ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహించిన ఆర్ అర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిసాయి.సుమారు ఇరవై జట్లు పోటీలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చూపారు.ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేరడిగోండ వర్సెస్ ధర్మరావుపేట జట్లు తలపడగా నేరడిగోండ జట్టు విజయం సాధించారు.రెండో స్థానంలో ధర్మారావుపేట,మూడో స్థానంలో ఆదిలాబాద్,నాలుగో స్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయి.కాగా గెలుపొందిన జట్లకు వసుధ ఆసుపత్రి డైరెక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా ఫ్రైజ్ మనీతో పాటు షీల్డ్, మెమొంటోలను అందించారు. టోర్నమెంటు నిర్వాహకులు,వివిధ పార్టీల నాయకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.