- మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ రేటు రూ. 400 లకు పెంచడంతో పాటు ఎండ తీవ్రత దృష్ట్యా వేసవి భత్యం ఏప్రిల్, మే మాసాలకు గాను 30% అదనంగా కల్పించాలని, దీనిఫై కేంద్రానికి నివేదించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇంధిర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడతూ ఉపాధి హామీ కులీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నెలకు రూ.1000 చొప్పున సంవత్సరానికి రూ.12000 చెల్లిస్తుందని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగి, మట్టి, చెత్త చెదారం పేరుకుపోవడంతో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువల మరమత్తుకు చేపట్టాలని, కాలువ మరమత్తులు చేపట్టక పోవడంతో చివరి పొలాలకు నీరు అందక రైతులు విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నారన్నారు. వ్యవసాయ కూలీల సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యతగా భావించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి లేఖ రాస్తున్నానని తెలిపారు.రాష్ట్రంలో నీటి సంఘాల అవశ్యకత ఉన్నది..ప్రభుత్వ ఆలోచన కూడా చేస్తున్నదని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి భత్యం కల్పించేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, గుంటి జగదీశ్వర్, రాధాకిషన్, గుండా మధు, బొల్లి శేకర్, ముకేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.