స్వచ్ఛమైన హిందూ ధర్మం పాటిస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదు-అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆది పరాశ్రీ స్వామీజీ
-సనాతన ఆచారాలు పాటించాలి
-హిందువు అనే పదానికి అర్థం క్రమశిక్షణ
ముద్ర, నారాయణ పేట:
స్వచ్ఛమైన హిందూ ధర్మం పాటిస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదనీ…సనాతన హిందూ ఆహారపు అలవాట్లు అందరూ తిరిగి పాటించాలని అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆది పరాశ్రీ స్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబాత్త్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆది పరాశ్రీ స్వామీజీ హాజరై మాట్లాడారు. హిందువు అంటేనే క్రమశిక్షణకు అర్థం అన్నారు. టెక్నాలజీ పేరుతో కుక్కర్ లు… ఎలక్ట్రానిక్ వస్తువులు… ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో క్యాన్సర్ రోగం కలిగిన మనుషులు తయారవుతారు. మన సనాతన ధర్మంగా వస్తున్న ఆహారపు అలవా…. ఆచార వ్యవహారాలను పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నారు. హిందూ ధర్మ పద్ధతులను ప్రతి ఒక్కరు తమ పిల్లలకు నేర్పించాలన్నారు. భారతదేశం ఎంతో గొప్పనైనదని తెలిపారు. సూర్యుడు చంద్రుడు… భూమి ఆకాశం… పంచభూతాలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో నుంచి మనల్ని ఎవరు ఏమీ చేయలేరన్నారు. అంతకుముందుగా శ్రీరాముని చిత్రపటానికి పూజలు చేసి… యజ్ఞ కార్యక్రమంతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేతా సత్యాయాదవ్, కౌన్సిలర్లు సత్య రఘుపాల్, కాకర్ల నారాయణమ్మ, సౌజన్య, మహేష్, భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి, మ్యాడమ్ ప్రభాకర్, శ్రీరామ బస్తి హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు గుంపు బాలరాజ్, పత్తికొండ రాములు, అమ్మపల్లి శిరీష, ఆయా బస్తీల నుంచి పెద్ద ఎత్తున హిందూ సమ్మేళన సమితి సభ్యులు పాల్గొన్నారు.