ముద్ర, కోరుట్ల;
జాతీయ జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. వేంపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల లత అనే రైతు పండించిన పంటను కోసి కుప్పగా పోశారు. ప్రమాదవశాత్తు మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైతులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, పంట పూర్తిగా కాలిపోయింది. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కాలిపోయిన పంటను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. జరిగిన నష్టంపై పూర్తి వివరాలను సేకరించి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించి, ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.