Take a fresh look at your lifestyle.

శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా హిందూ సమ్మేళనం…

 

*సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్….

ముద్ర, కరీంనగర్:

కరీంనగర్ పట్టణం (చైతన్యపురి బస్తి )హిందూ సమ్మేళనం శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణ ఆవరణలో ఘనంగా జరిగింది. హిందూ సమ్మేళనానికి ప్రధాన వక్త గా హాజరైన ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముక్ జయదేవ్ జి మాట్లాడుతూ హిందూ సమాజం కులాలుగా విడిపోకుండా ఐక్యతతో ముందు కొనసాగాలన్నారు. హిందూ ఐక్యతే హిందూ సమాజానికి, ప్రజానీకానికి వెయ్యి ఏనుగుల బలమన్నారు.

సనాతన ధర్మాన్ని, సంస్కృతి ,సాంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. స్వధర్మం పట్ల అంకితభావం , సేవా గుణం పెంపొందించడం మే లక్ష్యంగా హిందూ సమ్మేళనాల నిర్వహణ జరుగుతుందన్నారు. వందేళ్ళ ఆర్ఎస్ఎస్ ప్రయాణం పూర్తిగా దేశ హితం, సంస్కృతి సాంప్రదాయాల, ధర్మ పరిరక్షణ ధ్యేయంగా కొనసాగిందన్నారు. ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచ పరివర్తన్ విషయాలతో సమాజంలోకి వెళ్లే ప్రయత్నం చేసిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో చైతన్యపురి హిందూ సమ్మేళన సమితి బాధ్యులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.