ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం యశోద నగర్ పార్క్ నందు దొడ్డి కొమురయ్య 99 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూరు పురపాలక సంఘం చైర్మన్ శ్రీమతి శ్రీ పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి గారు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జోహార్ దొడ్డు కొమురయ్య అంటూ నినాదాలు ఇస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం… భుక్తి కోసం… వెట్టి చాకిరి విముక్తి కోసం అణగారిన ప్రజల హక్కుల కోసం అగ్ని జ్వాలగా నిలబడి పోరాడిన వీరుడు… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తొలి అమరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించినందున తాండూర్ టౌన్ కురువ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
అలాగే తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు గారు మాట్లాడుతూ. ఆయన త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకం కావాలి అని కొనియాడుతూ నివాళులర్పించడం జరిగినది. కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కురుమ సంఘ సభ్యులు, నాయకులు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.