ముద్ర : కాప్రా
విద్యాభివృద్ధే సమాజ పురోగతికి మూలాధారం అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మల్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్ , బండారి లక్ష్మారెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి టెక్ నిప్ ఎఫ్ ఎం సి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించగా, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ భాగస్వామిగా ఉంది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.