Take a fresh look at your lifestyle.

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

 

ముద్ర కాప్రా

చిలుక నగర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వర నగర్ కాలనీ,శ్రీ విజయ గణపతి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతో, సహస్రాధిక ఆలయ ప్రతిష్టాకర్త మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులు బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని గారి ఆధ్వర్యములో జరిగినాయి.

ఈ మహోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలంకరణలతో సుందరంగా అలంకరించబడగా, ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి హోమం, లక్ష్మీనరసింహ స్వామి అభిషేకం, అర్చనలు ఘనంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ఇలాంటి వార్షికోత్సవాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. సమాజంలో ఐక్యత, సౌహార్దతను బలపరచడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయి” అని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, గుడి మధు సుదన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.