Take a fresh look at your lifestyle.

పేలుళ్లు జరిగిన ప్రాంతంలో.. చెత్తను వేస్తున్న పట్టించుకోరా..!

కుషాయిగూడ, ముద్ర విలేఖరి: ఈ చిత్రంలో కనిపిస్తున్నది కుషాయిగూడ పారిశ్రామికవాడలో మూడు నెలల క్రితం వరుస పేలుళ్లు జరిగిన ప్రాంతం.గత మార్చి నెలలో ఇక్కడ పేరుక పోయిన చెత్తను తొలగిస్తుండగా.. పేలుడు సంభవించి ఒక కార్మికుడు మృతి చెందగా, క్లూస్ టీం సిబ్బంది తీవ్రంగా గాయపడిన సంఘటన తెలిసిందే. చెత్త కుప్పలో నిల్వ ఉన్న వ్యర్ధ రసాయనాలతో వరుస పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు..రోడ్డును సైతం మూసివేశారు.జిల్లా యంత్రాంగం అన్ని విభాగాల అధికారులతో కలసి ఆరు రోజులు శ్రమించి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను వేస్తున్నారు. దానికి తోడు ఇక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చెట్టుకొమ్మలు అడ్డుగా ఉన్నాయని ఇటీవల విద్యుత్ సిబ్బంది సమీపంలో ఉన్న చెట్టు కొమ్మలను కొట్టించారు. ఆ కొమ్మలను సైతం తొలగించకపోవడంతో ఆ ప్రాంతమంతా చెత్తకుప్పను తలపిస్తుంది. చెత్త కుప్పలో పేలుళ్లు జరిగి మూడు నెలలు కాకముందే ఇక్కడ మల్లా చెత్త వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినప్పుడే స్పందిస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.