Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

  • ఆర్జీ 1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం జిఎం కార్యాలయం లో మహిళా ఉద్యోగినులు,సేవా సమితి శిక్షకులతో జిఎం ఆర్జీ-1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ అధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆర్జీ-1 సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ మును పురస్కరించుకొని సింగరేణి మహిళాఉద్యోగస్తులకు,గృహిణులకు,మహిళలకు వివిధ ఆటల పోటీలు స్థానిక జి.యం కాలని గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగాణం లో ఈనెల 6 న గురువారం మధ్యానం.3.00 గం.లకు నిర్వహింపబడునని తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ఈనెల 8 శనివారం ఉదయం.10.00 గం.లకు ఆర్.సి.ఓ.ఎ క్లబ్ లో అత్యుత్తమ సేవలందించిన మహిళలకు సన్మానం,మహిళలచే పలు సాంసృతిక కార్యక్రమాలు, ఆటల పోటిలలో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రధానం ఉంటుందని తెలిపారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిజియం పర్సనల్ కిరణ్ బాబు,సీనియర్ పి.ఓ హన్మంత రావు,సేవా జాయింట్ సెక్రటరి బినా సింగ్,ఎ.ఐ.టి.యు.సి ప్రతినిది శ్రీమతి పద్మ,కోఆర్డినేటర్లు తిరుపతి,రవికుమార్ సేవా శిక్షకులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.