Take a fresh look at your lifestyle.

మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ రజిని

ముద్ర ప్రతినిధి, వనపర్తి: మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రపతి ద్రౌపతి మురుముగారిని ఆదర్శంగా తీసుకొని మహిళలు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి అని సూచించారు.సమాజంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొని మహిళలు వారి జీవిత ఆశలను నెరవేర్చుకోవాలని కోరారు.అన్ని వర్గాల బాలికలకు మహిళలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది అని తెలియజేశారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమైన చట్టాలను వివరించడంలో భాగంగా బాల్యవివాహాల చట్టం ఫోక్సో యాక్ట్ బాల కార్మికుల చట్టం మోటారు వెహికల్ చట్టం గురించి తెలియజేశారు.ఉచిత న్యాయ సలహాలు కొరకు15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య డిప్యూటీ లార్డ్స్ జీ ఉత్తరయ్య ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.