బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని 27, 28 డివిజన్ ల పరిధిలోని 45 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను శనివారం అందించారు. ఇందిరమ్మ ఇండ్లు 2 వ దశ లో భాగముగా 27 వ డివిజన్ మరియు 28 డివిజన్ లకు సంబందించిన (45) మంది లబ్దిదారులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎ.శైలజ మాట్లాడుతూ లబ్ది దారులు ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి నిర్మాణం చేపట్టాలని సూచించారు.
మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయిస్తామని, ఇట్టి అవకాశామును ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమము లో కమిషనర్ ఎ.శైలజ, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్లతో పాటు, హౌసింగ్ ఏఈ అల్లాజీ, మాజీ కార్పొరేటర్లు పోగుల నరసింహ రెడ్డి, కొత్త చందర్ గౌడ్, చీరాల నరసింహ, బందారం శ్రీధర్ గౌడ్, సుమన్ భూక్య, జక్కల జయ రాములతో పాటు 27 & 28 డివిజన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prev Post