-
అధికారులకు ఫిర్యాదు చేసి రశీదు తీసుకుందాం: మాజీ ఎమ్మెల్యే పైళ్ల
బీబీనగర్, ముద్ర విలేకరి: స్థానిక ఎన్నికల సందర్భంగా గ్రామాలలో ప్రదర్శిస్తున్నఓటరు జాబితాలో ఏమైనా తేడాలు గమనిస్తే ఫిర్యాదు చేయాల్సివుందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జి పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో నూతన ఓటరు జాబితాలను ప్రధర్శించివున్నారు. గ్రామానికి చెందిన 18 సంవత్సరాల వయసు నిండి, ఓటుకు అర్హత కలిగివుండీ జాబితాలో పేరు లేకపోయినా, ఇంకా ఎవరివైనా పేర్లు తొలగించినట్టు గుర్తించినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాతపూర్వకంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు చేసి రశీదు పొందాలని సూచించారు. ఈ మేరకు మండలస్థాయి నాయకులు సహకరించాల్సిందిగా ఆయన ఆదేశించారు.