ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
పట్టణ పరిధిలో ఉన్న ప్రతి వాణిజ్య సముదాయం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని దుకాణ యజమానులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు, హాస్పిటళ్లు, హోటళ్లు మరియు ఇతర అన్ని షాపులు మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు.

మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ పొందని వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకునే వారికి 25 శాతం పెనాల్టీ విధించబడుతుందని, జూలై 1 నుంచి తీసుకునే వారికి 50 శాతం పెనాల్టీ విధించబడుతుందని తెలిపారు. అవసరమైతే లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న షాపులను సీజ్ చేసే చర్యలు కూడా చేపడతామని చెప్పారు.
అందువల్ల పట్టణంలోని దుకాణ యజమానులు ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాల కోసం తిరుపతయ్య (9550942030), సతీష్ (9160000647)లను సంప్రదించవచ్చని తెలిపారు