Take a fresh look at your lifestyle.

బాధిత మహిళలకు అండగా ఉంటాం

  • హక్కులు చట్టాలపై అవగాహన కల్పించాలి.
  • మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం.
  • 30 కేసులకు పైగా పరిష్కారం.
  • జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కార్.

ముద్ర, తెలంగాణ బ్యూరో: వివిధ సమస్యలు కేసులతో సతమతమవుతోన్న బాధిత మహిళలకు అండగా నిలుస్తామని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ భరోసా ఇచ్చారు.సోమవారం హైదరాబాద్ టూరిజం ప్లాజా సమగం హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయి( బహిరంగ విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పెండింగ్​ లో ఉన్న 30 కేసులను పరిష్కరించి బాధిత మహిళలకు న్యాయం చేశారు.ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుండి 60 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ఆయా ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు.కమిషన్ దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బాధిత మహిళల నుండి వేల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. కమిషన్ ముఖ్య ఉద్దేశం మహిళలు పడుతున్న బాధలు, కష్టాలు బాధితుల యొక్క సమస్యల సత్వరం పరిష్కారం కోసం కమిషన్ నేరుగా బాధితుల వద్దకే వస్తోందన్నారు.మహిళల గృహహింస కేసులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ హారాష్మెంట్ కేసులు, చైల్డ్ కస్టడీ కేసులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలతో పాటు ఇతర కేసులు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు.హైదరాబాద్ పరిధి లో 2022 నుంచి 2024 వరకు ఉన్న కేసుల్లో 30 కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఎక్కడ కూడా అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపకుండా మహిళా కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లో నెలలో నెలకు నాలుగు సార్లు కమిషన్ బాధిత మహిళల వద్దకు వెళ్లి సత్వర న్యాయం చేసి అండగా నిలుస్తోందన్నారు. పెండింగ్ కేసుల అంశాలను నివేదిక రూపంలో సత్వరమే అందించాలని పోలీస్ అధికారులను ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నేరెళ్ల, మహిళా సంక్షేమ శాఖ సంచాలకులు క్రాంతి వెస్లీ, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ విశ్వ ప్రసాద్, అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి, డీసీసీ లావణ్య, హైదరాబాద్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, వయోవృద్ధుల శాఖ అధికారి రాజేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆశన్న వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాలు, బాధిత మహిళా కుటుంబాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.