Take a fresh look at your lifestyle.

  ​స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే,అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసిన పూలే -అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్

ముద్ర, వనపర్తి :
సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి వెల కట్టలేనిదని, కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే గారి మహోన్నత సేవలను స్మరించుకున్నారు. వేదికపై ఆర్డీవో సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, డీపీ ఆర్ఓ సీతారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు కౌన్సిలర్లు శరవంద, మహేశ్వరి ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని తెలిపారు. మహిళలకు విద్య అందించ డంలో పూలే  ముందుండి పోరాటం చేసి తొలి బాలికల పాఠశాలను స్థాపించారని గుర్తుచేశారు. సమాజంలో ఉన్న కులవివక్ష, అన్యాయా లపై ఆయన నిరంతరం పోరాడుతూ సమాన హక్కుల కోసం కృషి చేశారని వివరించారు. పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నా యని, ఆయన చూపిన దారిలో నడవడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత పూలే గారి స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని సూచించారు. విద్య అందరికీ సమానంగా అందాలి అనే లక్ష్యంతో పూలే అనేక పాఠశాల లను స్థాపించడం గొప్ప విషయం అని అన్నారు. భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో మహిళా విద్యాభివృద్ధికి బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవం పెంపొందించే దిశగా పూలే ఆలోచనలు ఎంతో ప్రేరణనిస్తాయని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూలే ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు పూలే జీవితం నుండి స్ఫూర్తి పొందుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం విద్యార్థులకు చదువు కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకొని పైకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజానికి చేసిన సేవలను కొని యాడారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిబాపూలేను గుర్తు చేస్తూ కళాకారులు చేసిన ప్రదర్శనలుఅందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశంలో మహనీయుల సభ కమిటీ అధ్యక్షులు గంధం నాగరాజు, ప్రజా సంఘాల నాయకులు రాజారాం ప్రకాష్, బండలయ్య, చీర్ల జనార్ధన్, ఉమల్ల రాములు, కే వెంకటేష్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఇతర కవులు కళాకారులు, ఉపాధ్యాయులు కిరణ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.