Take a fresh look at your lifestyle.

క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కు జిల్లా నుండి 20 మంది విద్యార్థులు ఎంపిక డీవైఎస్ఓ ఎస్.స్వర్ణలత వెల్లడి

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకై రాష్ట్ర స్థాయి ఎంపికల కోసం జిల్లా నుండి 20 మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా యువజన,క్రీడాశాఖాధికారి ఎస్.స్వర్ణలత తెలిపారు. నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల ఎంపికలను మూడు దశల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు.


మొదటి దశగా మండల స్థాయి ఎంపిక ప్రక్రియ ఈనెల 17న విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మండలాల్లో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి ఎంపిక కోసం సోమవారం సరూర్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా, శారీరక సామర్థ్య, నైపుణ్య పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్రస్థాయి సెలక్షన్స్ కోసం పంపించేందుకు ఎంపిక చేసినట్లు డీవైఎస్ఓ వెల్లడించారు. ఈ ఎంపిక కార్యక్రమానికి జిల్లాకు చెందిన 75 మంది విద్యార్థులు హాజరై వివిధ పరీక్షల్లో పాల్గొనగా, క్రీడల కోచ్ లు ప్రక్రియను పూర్తి చేసారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ క్రీడాపాఠశాల (హకీమ్పేట్–కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని డీవైఎస్ఓ స్వర్ణలత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి శ్రీమతి ఎస్. స్వర్ణలత గారు (DYSO) ఆధ్వర్యంలో, జిల్లాకు చెందిన కోచ్‌లు సమన్వయం చేస్తూ నిర్వహించారు.

 

Leave A Reply

Your email address will not be published.