ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 19 స్థానాలను కాంగ్రెస్ పార్టీ
కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఏ ఇతర పార్టీల మద్దతు లేకుండా స్వతహాగా మెజార్టీ స్థానాలను సాధించినందుకు తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి 19 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకు ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు వార్డుల వారీగా
2 వ వార్డ్ ప్రత్యూష, 3వ వార్డ్ తయాబ్ సుల్తానా, 4వ వార్డ్ మెహరు న్నిసా బేగం, 10వ వార్డ్ అల్లాపూర్ శ్రీకాంత్,11వ వార్డ్ బంటు వేణు, 12వ వార్డ్ నీరజ బాల్రెడ్డి,14వ వార్డ్ మాయ అంజు, 15వ వార్డ్ దివిటి ఎల్లప్ప,16వ వార్డ్ నారా శ్రీలత,17వ వార్డ్ సాయ తపసుం 19వ వార్డ్ జుంటుపల్లి వెంకట్, 21వ వార్డ్ సభ ఫాతిమా, 22వ వార్డ్ రామకృష్ణ, 24వ వార్డ్ బాలకృష్ణారెడ్డి, 26వ వార్డ్ వైశాలి, 27వ వార్డ్ ఉప్పరి స్వరూప, 29వ వార్డ్ అబ్దుల్ రజాక్, 30వ వార్డ్ మెహరాన్ బేగం,35వ వార్డ్ అప్సర్ నూర్ అహ్మద్ లు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. మాజీ బిఆర్ఎస్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ తరపున గెలుపొందిన 12 మంది కౌన్సిలర్లకు ధన్యవాదములు తెలియజేశారు. గెలుపొందిన వారి వివరాలు వార్డ్ నెంబర్ 1 నుండి నాగలక్ష్మి,6వ వార్డు నుండి అనిల్ ఆర్మీ,7వ వార్డు నుండి ఇర్షద్, 8వ వార్డు నుండి జావిద్, 9వ వార్డునుండి పట్లోళ్ల దీప, 13వ వార్డు నుండి సురేష్ నాయక్, 20వ వార్డు నుండి నవీన,25వ వార్డ్ నుండి నసీరాబాను, 31వ వార్డు నుండి యోగానంద్, 32వ వార్డ్ నుండి మహేశ్వరి, 34వ వార్డు నుండి సుప్రీత పటేల్,36వ వార్డు నుండి రూప పాటిల్ లు గెలుపొందారు. బిజెపి పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు.23వ వార్డు నుండి అంతారం కిరణ్, 28వ వార్డు నుండి నాగరం మల్లేశం,33వ వార్డు నుండి శ్రీకాంత్ రెడ్డి లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అభినందించారు.18వ వార్డు నుండి ఎంఐఎం అభ్యర్థి మోయిస్ ఖాన్ గెలుపొందారు, ఐదవ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి జినత్ బేగం గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులందరికీ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.