Take a fresh look at your lifestyle.

టిఆర్ఎస్ లో ప్రముఖులకు తప్పని ఓటమి

 
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నాయకులకు సైతం మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. కాంగ్రెస్కు అనుకూల పవనాలు వీచడంతో ప్రముఖులు సైతం ఓటమి చెందారు. టిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ 30వ వార్డు నుండి నాలుగు సార్లు గెలుపొంది ఐదోసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచాల క్రాంతి కుమార్ గౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే కాగితాల లక్ష్మీనారాయణ ఆయన సతీమణి కాగితాల శారద ఒకటో వార్డు నుండి గతంలో మూడుసార్లు పోటీ చేసి విజయం సాధించినప్పటికీ ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చుక్క రాజు సతీమణి చుక్క జయశ్రీ గెలుపొందారు. అలాగే 33 వ వార్డులో సీనియర్ నాయకుడైన ఉంగులం తిరుమల్, ఆయన సతీమణి గతంలో విజయం సాధించినప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవి చేతిలో ఓటమి పాలయ్యారు.

Leave A Reply

Your email address will not be published.