– 13 మున్సిపాలిటీ లలో విజయకేతనం
– 3 మున్సిపాలిటీ లలో హంగ్
– చెరొకటి బీ ఆర్ ఎస్, బీజేపీ
– కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ క్వీన్ స్లీప్ 16 వార్డుల్లో 16 లో విజయం
– గద్వాల, అమరచింత, అలంపూర్ లో హంగ్
– మంత్రుల, ఎమ్మెల్యే ల కృషి కి దక్కిన ఫలితం
……………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
కాంగ్రెస్ పార్టీ కే ఓటర్లు పట్టం కట్టారు. అధిక మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో 19 మున్సిపాలిటీ లలో 13 స్థానాల్లో చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఐజ మున్సిపాలిటీ లో బీ ఆర్ ఎస్ గెలుపొందగా వడ్డేపల్లి మున్సిపాలిటీ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, నారాయణ పేట లో బీజేపీ విజయం పొందింది.మరో మూడు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. గద్వాల, అలంపూర్, అమరచింత లో ఏ పార్టీ మేజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే,స్వతంత్రుల ఓటుతో గట్టెక్కే పరిస్థితి ఉంది.కాంగ్రెస్ కు ఊహించని మున్సిపాలిటీ స్థానాలు రావడం తో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది.బీ ఆర్ ఎస్ పార్టీ నేతలకు ఊహించని ఫలితాలు రావడం తో ఖంగుతిన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘన విజయం అందించారు. వాకిటి శ్రీహరి నియోజకవర్గం లోని అమరచింత మాత్రం హంగ్ లోకి వెళ్లిపోయింది.మక్తల్, ఆత్మకూరు మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడింది. దేవరకద్ర నియోజకవర్గం లో ఉన్న మూడు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక్కడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన పరిధి లోని దేవరకద్ర, కొత్తకోట, భూత్పూర్ మున్సిపాలిటీ లలో చైర్మన్ పదవి కి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. వనపర్తి నియోజకవర్గం లోని వనపర్తి, పెబ్బేర్ మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషి తో మేజిక్ ఫిగర్ దాటి రెండు చైర్మన్ పదవులను కాంగ్రెస్ ఖాతాలో జమ చేశారు. కొడంగల్ నియోజకవర్గం లోని కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబీ మోగించింది. కోస్గి లో క్వీన్ స్లీప్ చేసింది, 16 వార్డులకు గాను 16 లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కొడంగల్ రేవంత్ రెడ్డి అడ్డా అనే పేరును సార్థకం చేశారు ఇక్కడి ఓటర్లు. నారాయణ పేటలో 24 వార్డుల్లో బీజేపీ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఓటు తో బీజేపీ గట్టెక్క నుంది.నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ శిఖరాలకు చేరుకుంది. గద్వాల మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి సరిత మధ్య రాజకీయ సమన్వయం లేకపోవడం తో మేజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో ఇక్కడి మున్సిపాలిటీ లో హంగ్ ఏర్పడింది. అలంపూర్ లో 10 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ 5,బీ ఆర్ తీసుకొని 5 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ ఎక్స్ ఆఫీసియో సభ్యుల ఓటుతో గట్టెక్కాలని ఉన్నా ఇక్కడ బీ ఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ మల్లురవి ఉన్నారు. వీరు ఓట్లు వేసినా సమానమైన ఓట్లు ఉంటాయి. ఇది ఫలితం ఎలా ఉంటుందో అని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్, బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయాయి.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post