ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: కార్మిక చట్టాలను కొనసాగించాల ని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సింగరేణిలో సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం పాల్గొని సమ్మెను సక్సెస్ చేశారు.సమ్మెలో పాల్గొని జయప్రదం చేసిన సింగరేణి కార్మికులు విప్లవ జేజేలు తెలిపారు.లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తాం అని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కార్మిక చట్టాలను కొనసాగించా లని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు సింగరేణి కాంట్రాక్టు కార్మికులు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో పాల్గొని జయప్రదం చేశారని, వారందరికి ఏఐటియుసి పక్షాన, సింగరేణి జేఏసీ పక్షాన విప్లవ జేజేలు తెలుపుతున్నామని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించిన అనంతరం ఆయన జేఏసీ సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి,మిర్యాల రాజిరెడ్డి, పి.ధర్మపురి,కట్ట విశ్వనాథం లతో కలిసి మాట్లాడుతూ కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం వంద సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించడాన్ని దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు,ఉద్యోగ సంఘాలు,ఫెడరేషన్ లు, అసోసియేషన్ లు వ్యతిరేకించా యని ఆయన అన్నారు.కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశ పెట్టి అమలు చేస్తే వేతన సవరణ కమిటీ లు ఉండవని,ఉద్యోగ భద్రత ఉండదని,కార్మిక సంఘాలు ఉండవని,సమ్మె చేసే హక్కు ఉండదని,దీని వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని భావించి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపు మేరకు నేడు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు,ఉద్యోగులు,కాంట్రాక్టు కార్మికులు గత పది రోజుల పాటు గుర్తింపు సంఘంతో పాటు జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేయాలని కోరిన మేరకు నేడు సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడం జరిగిందని,సమ్మె లో పాల్గొన్న వారందరికీ విప్లవ జేజేలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.నేటి సమ్మె తో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వాని కి కార్మిక వర్గం తగిన బుద్ది చెప్పారని ఆయన అన్నారు.అదే విధంగా సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.నేటి సమ్మె సందర్భంగా పలు డిమాండ్ లతో కూడిన సమ్మె నోటీసును యాజమాన్యం కు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,తెలంగాణా లో ఉన్న బొగ్గు గనులను ప్రైవేటు కు ఇవ్వకుండా,నిజాం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సింగరేణి కే కేటాయించాలని,ప్రతి కార్మికుడికి స్వంత ఇంటి పథకం అమలు చేయాలని,ప్రైవేటీకరణను రద్దు చేయాలని,అలవెన్సుల పై ఆదాయపు పన్ను ను యాజమాన్యమే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీ కరణ చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.యాజమాన్యం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తో పాటు జేఏసీ సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, ఆరెల్లి పోషం,మాదన మహేష్, సంకె అశోక్,రంగు శ్రీను,ఎం.ఎ. గౌస్,బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, పెర్క మహేందర్, సయ్యద్ సోహేల్,చెప్యాల భాస్కర్, ఎం.చక్రపాణి, కే.శ్రీనివాస రావు, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్,నాయిని శంకర్, దాసరి శ్రీనివాస్,రెడ్డి వెంకట స్వామి, బండి మల్లేష్, ఇజ్జగిరి రాజు,సంతోష్,సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు,నాయకులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, మడికొండ ఓదేమ్మ, తొడుపునూరి రమేశ్ కుమార్, జేఏసీ సంఘాల నాయకులు కచ్చకాయల సదానందం,మెండె శ్రీనివాస్, మాదాసు రాంమూర్తి, వడ్డేపల్లి శంకర్, డి.లచ్చన్న తో పాటు జేఏసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
