Take a fresh look at your lifestyle.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

  • లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారి.

కుషాయిగూడ (మల్లాపూర్), ముద్ర విలేఖరి: ఉప్పల్ మండల పరిధిలో పలువురికి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం మల్లాపూర్ వి ఎన్ ఆర్ గార్డెన్ లో 320 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో దోహాదపడుతున్నాయన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ తహసిల్దార్ వాణిరెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన్ శేఖర్, ప్రభుదాస్, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.