Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… జెండా ఎగరవేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, బిఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలి దానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్ లు దేవేందర్ నాయక్, అవారి శివ కేసరి బాబు, కోరుగాంటి రాము, తోట హరీష్, శ్యామల శేఖర్ , గాజుల రాజేందర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, మాజీ కౌన్సిలర్ లు ఒడ్డి శ్రీలత రామ్మోహన్, మ్యక పవన్, దుర్గయ్య, BRS నాయకులు శీలం ప్రవీణ్, దయాల మల్లారెడ్డి, గుండా మదు, రాజేష్, కచ్చు హరీష్, గంగాధర్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.