ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవం మంగళవారం గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో భాగంగా గొల్ల కురుమ సంఘం సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రాజేశ్వరరావు జాతర ఉత్సవాలను పరిశీలించి, భక్తులతో కలిసి కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ఇలాంటి పుణ్యక్షేత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు వేద ఆశీర్వచనాలతో వడ్డేపల్లి రాజేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సంఘం నాయకులు:
నగేష్ యాదవ్
నర్సింగ్ రావు
నర్సింగ్ యాదవ్
గోపాలకృష్ణ కురమ
మల్లేష్ యాదవ్
చైతన్య యాదవ్
మనమ్మ, మల్లమ్మ, లలిత మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.