కోరుట్ల/కథలాపూర్, ముద్ర:- నిప్పంటుకొని మహిళ మృతి ఘటన కోరుట్ల మండలంలో చోటు చేసుకొంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు 70 అనే వృద్ధురాలు, శనివారం రోజు సాయంత్రం సమయంలో చాయ్ తాగడానికని ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్ పై చాయ్ పెట్టుకోగా, ప్రమాదవశాత్తు తన చీర కొంగుకు నిప్పు అంటుకొని శరీరం అంతా కాలిపోగా, హుటాహుటిన అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేపిస్తుండగా ఆదివారం రోజు ఉదయం సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలి కొడుకు గడ్డమీద గంగ నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు కథలాపూర్ ఎస్సై జి. నవీన్ కుమార్ తెలిపారు.