Take a fresh look at your lifestyle.

బాలునిపై కుక్కల దాడి..బాలుని కన్ను గుడ్డు ఊడిపడింది

 ముద్ర ప్రతినిధి, భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరిలోని తారకరామ నగర్ లో హృదయ విధారక ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రియాంష్ అనే 3 సంవత్సరాల బాలునిపై  కుక్కల దాడి చేయగా కన్ను గుడ్డు ఊడిపడింది.

గాయలతో అల్లాడుతున్న బాలుడుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి హైదరాబాదుకు తరలించారు. ప్రభుత్వఆసుపత్రి వద్ద నిరసన చేసిన వార్డ్ ప్రజలు.బాలునిపై  కుక్కల దాడికి నిరసనగా వార్డ్ ప్రజలు ప్రభుత్వఆసుపత్రి వద్ద రాస్తారోకో చేశారు. వీధి కుక్కలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది

Leave A Reply

Your email address will not be published.