హనుమకొండ,ముద్ర: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను టిడిపి మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ ప్రజలు కార్యకర్తలు అందరూ బాగున్నారా అని అడిగి తెలుసుకున్నారు.పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు.ఇటీవల అనారోగ్యంకు గురైన మహబూబాబాద్ పట్టణ టిడిపి అధ్యక్షులు బోమ్మ వెంకటేశ్వర్లుకు మెరుగైన చికిత్స కోసం ఆర్దికసహాయం కోరగా చంద్రబాబు నాయుడు వెంటనే 5 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఏపి సి.ఎం ను కలిసినవారిలో టిఎన్టీయుసి రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి పోటు రంగారావు, పార్టీ నాయకులు సుతార వెంకటనారాయణ, ప్రెమచంద్ వ్యాస్, బోమ్మ వెంకటేశ్వర్లు, హరి తదితరులు ఉన్నారు