Take a fresh look at your lifestyle.

భూమి ఒకరిది.. పట్టా మరొకరిది!

  • అధికారుల తప్పిదంతో రైతుకు కష్టాలు.
  • నాలుగేళ్లుగా విన్నపాలు.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రెవెన్యూ అధికారులు చేసిన చిన్న పొరపాటు ఆ రైతుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నాలుగేళ్ళ కిందట తన పేరిట ఉన్న 12 గుంటల భూమిని అధికారులు ధరణి వెబ్సైట్ లో మరో వ్యక్తి పేరుపై నమోదు చేయడం తో బాధిత రైతు భూమి తన పేరిట చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేదాక తిరుగుతున్నాడు.వివరాల్లోకి వెళ్తే….కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఏలేటి రాజిరెడ్డి కి 12 గుంటల భూమి ఉంది. అయితే ఆభూమి తన పేరు కాకుండా వేరే పేరు మీద నమోదైంది. ఆరేపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాజిరెడ్డి 12 గుంటల భూమి ధరణి తప్పిదం వల్ల అదే గ్రామానికి చెందిన వెలుపూల రాజిరెడ్డి పేరున 12 గుంటల భూమి అతని పేరు పైన పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. మా తాత ముత్తాత నుండి ఏలేటి వారికి సర్వేనెంబర్ 1279లో 5 ఎకరాల భూమి ఉండేదని, అందులో ఆరు భాగాలు ఉన్నాయని, ఐదు భాగాలు అందరికీ వారి పేరు మీద పాస్ బుక్ రావడం జరిగిందని, నాకు సంబంధించిన 12 గుంటల భూమికి పట్టా పాసుబుక్ రాలేదని ఏలేటి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయం పైన గత నాలుగై సంవత్సరాలు నుండి అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు వెలుపుల రాజిరెడ్డి పేరు పైన ఉన్న 12 గుంటల భూమిని నా పేరు పైన నమోదు చేయాలని అధికారులను కోరారు. ప్రస్తుతం భూ భారతిలో భాగంగా ధరణి ప్రక్షాళన చేస్తున్నారని, తన సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.