Take a fresh look at your lifestyle.

గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

ముద్ర,వీపనగండ్ల: గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు ఉండకపోవడంతో కుటుంబాలు పస్తులు ఉండాల్సిన ఇబ్బంది ఏర్పడుతున్నాయని, వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలంటూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎంపీడీవో, డిప్యూటీ తాసిల్దార్ లకు వినతి పత్రాలు అందజేశారు. పెండింగ్ మెత్తనాలు వెంటనే చెల్లించకపోతే ఈనెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతామని మండల పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు వెంకటయ్య హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న రెండు నుంచి ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించి ఇకనుంచి రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు అందించాలని, కార్మికుల వేతనం కోసం ప్రత్యేక గ్రాంట్ ను ఏర్పాటు చేయాలని,పెరుగుతున్న జనాభా కనుగుణంగా గ్రామపంచాయతీలో కార్మికులను పెంచాలని,కౌరవుబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి,వారిని పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలని అన్నారు.ప్రతి ఒక్క వర్కర్ కు 5 లక్షలు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా 10 లక్షలు, దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పది దినాన్ని అమలు చేసి,ఆదివారం సెలవు దినాలను ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి సంవత్సరానికి మూడు జతల యూనిఫాం, చెప్పులు, సబ్బులు, నూనెలకు నగదు రూపంలో అలవెన్స్,తదితర డిమాండ్లతో కూడిన అవినీతి పత్రాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావుకు, డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ మూర్తి లకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు గోవిందు, శివుడు, రాజబాబు చారి, లక్ష్మయ్య, గంగమ్మ, బాలనాగమ్మ, ఎల్లమ్మ,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.