Take a fresh look at your lifestyle.

హనుమాన్ జయంతి సందర్బంగా పలు ఆలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ

మాదాపూర్, ముద్ర : హనుమాన్ జయంతి పూరష్కరించుకుని శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ లో గల శ్రీ బాలాంజనేయ స్వామి ,శ్రీ సాయి బాబా దేవాలయం, హఫీజ్పేట సాయినగర్ దేవాలయం లో జరిగిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, ఏకాంత్ గౌడ్, విధ్యకల్పన గౌడ్, అల్లం మహేష్, పరమేష్ ,నరేష్ మరియు భక్తులు పాల్గొన్నారు.హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బోయిన మహేష్ యాదవ్, రఘునాథ్, లక్ష్మణ్ గౌడ్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.