Take a fresh look at your lifestyle.

ఎక్లాస్ పూర్ లో చలివేంద్రం ప్రారంభించిన శ్రీను బాబు

మంథని, ముద్ర: మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి , యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శ్రీను బాబు శ్రీపాదరావు స్మారక చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరవేన లింగయ్య యాదవ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథిని సత్యం,శీలం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్, మంథిని శ్రీనివాస్, నల్ల రాజశేఖర్, అర్థం సదానందం ,యూత్ అద్యక్షుడు రాదారపు నితిన్, నాంపల్లి సతీష్, కాంగ్రెస్ పార్టీ మంథని మండల మాజీ యూత్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, నాగుల రాజయ్య, పంచిక దేవేందర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.