ముద్ర, వనపర్తి:
వనపర్తి మండలం కాశీంనగర్ శివారులోని ఎర్రగట్టు పై వెలసిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పూర్తయిన రెండవ వారం త్రయోదశి రోజున గుట్ట పైన గల ఈ ఆంజనేయ స్వామి వారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
గుట్ట పైకి వెళ్లేందుకు దారి ప్రమాద భరితంగా ఉందని గుట్ట పైకి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వచ్చే ఏడాది నాటికి గుట్ట పైకి రహదారి నిర్మాణం చేపట్టడమే కాకుండా ఆయన ఆలయ అభివృద్ధి ఎల్లవేళల కృషి చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ zptc గొల్ల వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాక్య ఆదిత్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పెద్దలు మహిళలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు*_