Take a fresh look at your lifestyle.

వనస్థలిపురంలో దారుణం

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను హతమార్చిన మాజీ భర్త
రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే ఈ ఘాతుకం
పోలీసుల అదుపులో నిందితుడు

ముద్ర, వనస్థలిపురం :

హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం జరిగింది. ఆ కాలనీలో నివసిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హతమార్చాడం కలకలం రేపింది. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. మహేష్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరికి ఐదేళ్ల ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసింది. తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తోంది. దీంతో సునీత రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్, ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం రెండు పదునైన కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డువచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. సునీతపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు ఆమె అక్కడే కుప్పకూలింది. అయినప్పటికీ సునితను వదలని మహేశ్… అక్కడే ఉన్న పూలకుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో సునీతకు తీవ్ర రక్తస్రావం అయింది. అదే సమయంలో విలవిలాడుతూ సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేసుకున్న వనస్థలిపురం పోలీసులు నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.