Take a fresh look at your lifestyle.

కేపీహెచ్‌బీలో వివాహిత అదృశ్యం

​ముద్ర కూకట్‌పల్లి :

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
​కె.పి.హెచ్.బి ఫేజ్-6 లోని భావన రెసిడెన్సీలో యార్లగడ్డ రామ్ చంద్రకాంత్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఆయన పని నిమిత్తం బయటకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కుమార్తె ఫోన్ చేసి, తల్లి మాగంటి ప్రవళిక (37) ఇంట్లో మొబైల్ ఫోన్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందని సమాచారం అందించింది.
​వెంటనే ఇంటికి చేరుకున్న చంద్రకాంత్ అపార్ట్‌మెంట్ సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలించగా, ప్రవళిక ఒక క్యాబ్‌లో ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి. అవినాష్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.