Take a fresh look at your lifestyle.

విజయం దిశగా దూసుకెళ్తున్న 12వ వార్డ్ బిజెపి అభ్యర్థి రజినీకాంత్

 

ముద్ర. తాండూర్: వార్డ్ ప్రజలే కాకుండా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డు ప్రజల ఆత్మీయుడు, ధైర్య గుణశాలి, ఆపదలో ఉన్నవారికి నేనున్నాననే నమ్మకం కలిగించే వ్యక్తుల్లో మొదటగా నిలిచేది హిందూ హృదయ సామ్రాట్ రజనీకాంత్, మున్సిపల్ పరిధిలోనే మొట్టమొదటి విజయం రజనీకాంత్ దే అనడంలో సందేహమే లేదు. గత మున్సిపల్ఎన్నికల్లో ఆయన సతీమణి పూజ కౌన్సిలర్ గా గెలుపొందారు. కుంటాకు సమీపంలో ఉన్న ఈ వార్డులో కాస్త చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు ప్రవహించేది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. ఆ సమయంలోనే తన భర్త సహకారంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్యుత్ దీపాలంకరణ, త్రాగునీటి సమస్య ఇలా అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుకుతూ అంచెలంచెలుగా కాలనీలో అభివృద్ధి పనులను చేపట్టారు. ఈసారి బీసీ జనరల్ రావడంతో స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగారు. వార్డు ప్రజల సమస్యలతో బాటు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని పోరాడే వ్యక్తి, అంతకన్నా ముఖ్యంగా హిందుత్వ వాదనాలపై అలుపెరుగని పోరాటాలు చేయడంలో దిట్ట, బజరంగ్ దళ్, హిందూ ఉత్సవ సమితిలో చురుకైన పాత్ర పోషిస్తూ అందరి మన్ననాలు పొందారు. వార్డు ప్రజలే కాకుండా, తాండూర్ మున్సిపల్ పరిధిలోని మిగతా వార్డు పరిచయస్థులు కూడా రజనీకాంత్ గెలుపు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసే వ్యక్తి, హిందూ మనోభావాలకు ఆటంకం కలి గించే ఎటువంటి వారినైనా, తన ధైర్యశాలితో ప్రశ్నించగల అతి కొద్ది మంది వ్యక్తుల్లో మొదటగా ఉండేది రజినీకాంత్. 12వ వార్డు ప్రజలే కాకుండా, తాండూర్ నియోజకవర్గ ప్రజలు కూడా రజినీకాంత్ లాంటి వ్యక్తులను మున్సిపల్ కౌన్సిల్ కు పంపాలని, ప్రతి ఒక్కరి ఆశయం. బిజెపి పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలతో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో సైతం మాట్లాడి నిధులు తెచ్చి వార్డులో అభివృద్ధి చేయించగల వ్యక్తి. ప్రతిపక్ష పార్టీల మాటలు పట్టించుకోకుండా, ఎదుటి వారి బాధను కూడా తన బాధగా భావించి, ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి, ఇటువంటి నాయకులు వార్డు ప్రజలకు దొరకడం అదృష్టంగా భావించవచ్చు. ఏదేమైనా 12వ వార్డు ప్రజలు మాత్రం, ఇంత జనాదరణ పొందిన వ్యక్తికి, ప్రతి ఒక్కరి ఆశయాలు వమ్ము చేయకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో రజనీకాంత్ ను కౌన్సిల్ కు పంపి, 36 వార్డులోనే, మీ వార్డు పేరు మారు మోగేల చూడాలని, తాండూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష.

Leave A Reply

Your email address will not be published.