Take a fresh look at your lifestyle.

ధర్మ బిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

ముద్ర,మోత్కూరు:

భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ ) నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. గురువారం మోత్కూరులో గీత పనివారాల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దివంగత మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మ బిక్షం 15వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి,గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ లతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం ధర్మ బిక్షం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మగాని ధర్మబిక్షం సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశంలో ఎక్కడలేని విధంగా దున్నేవాడికే భూమి కావాలని విరోచిత ఆయుధ పోరాటంలో నల్లగొండ జిల్లాకు పోరాటానికి ధర్మంభిక్షం స్ఫూర్తినిచ్చారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాటి కమ్యూనిస్టు నాయకులైన ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, బీంరెడ్డి నరసింహారెడ్డిలతో కలిసి పెత్తందార్ల్లు భూస్వాములకు వ్యతిరేకంగా నిర్వహించారని పేర్కొన్నారు.గీత కార్మికుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. దేశంలో ఆర్థిక, అసమానతలు లేని పోరాటాలు చేసి ధర్మ బిక్షం దేశవ్యాప్త ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. నాడు బూటకపు ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్మ బిక్షం పోరాటాలు చేశారన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాలంటే కోటీశ్వరులుగా ఉన్న వ్యక్తులే పోటీ చేస్తున్నారని. రాజకీయంగా అనుభవం ఉండి ఆర్థిక సోమత లేని పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.విశిష్ట అతిథి సిపిఐ జాతీయ కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ధర్మ బిక్షం తన చిన్నతనం విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవార్చుకొని పేద విద్యార్థుల కోసం ఆనాటి రోజుల్లో ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు. దోపిడిలేని వ్యవస్థ రావాలి గూడు లేని సమాజం రావాలంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారత కమ్యూనిస్టు నాయకుడిగా ధర్మ బిక్షం అనేక పోరాటాలు చేశారన్నారు. అఖిల భారత గీతా పనివారాల సంఘం అధ్యక్షుడిగా గీత కార్మికులు గీసే కల్లును శీతాపానీయం లాగా చేయాలని ఆనాడే నుండే పాలక ప్రభుత్వాలపై ధర్మభిక్షం కొట్లాడారని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.గీత పనివారాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ధర్మ బిక్షం అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి గీతపనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు చాపల అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కప్పల రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్, వైస్ చైర్మెన్ లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా,సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ,చేడే చంద్రయ్య, బారాస జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గుర్రంలక్ష్మీ నరసింహరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అవిశెట్టి అవిలిమల్లు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశికంటి లక్ష్మీ నర్సయ్య, , సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, చెక్క వెంకటేష్, ఎండి ఇమ్రాన్, మండల కార్యదర్శి అన్నేపు వెంకట్,సహాయ కార్యదర్శి పులకరపు మల్లేశం,పట్టణ కార్యదర్శి బోయిని ఉప్పలయ్య, స్థానిక కౌన్సిలర్లు కురిమిళ్ళ ప్రమీల, గనగాని శైలజ, కారుపోతుల వెంకన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సమీర్ స్వతంత్ర సమరయోధులు బత్తిని యాదగిరి, గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.