Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి : పోచారం

బాన్సువాడ, ముద్ర: బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అధికారులు లబ్దిదారులకు అందుబాటులో ఉండి సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వర్ని మండల కేంద్రంలో జనరల్ ఫంక్షన్ హాల్లో వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, రుద్రూర్, పోతంగల్ మండలాల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంపై సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై వివరాలు తెలుసుకున్నారు. లబ్దిదారులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, రుద్రూర్, పోతంగల్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.